YS Sharmila drives tractor: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 90వ రోజుకు చేరింది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ఫుల్ జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన పాదయాత్రంతా ఒక లెక్క, ఖమ్మం జిల్లాలో జరుగుతోన్న పాదయాత్ర మరో లెక్క అన్నట్లుగా సాగుతోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రకు జనం నుంచి స్పందన లభిస్తోంది. 89వ రోజు వైరా మండలం ఖానాపురం గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల ట్రాక్టర్ నడుపుతూ కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. తాజాగా.. శుక్రవారం షర్మిల పాదయాత్ర మధిర నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బోనకల్ మండలం రాపల్లి గ్రామంలో ప్రవేశించిన వైఎస్ షర్మిలకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు కోరిక మేరకు షర్మిల నాగలి పట్టి దుక్కి దున్నారు. దీంతోపాటు ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
వీడియో..
పాదయాత్రలో షర్మిలా మట్లాడుతూ.. కేవలం ఐదేళ్లలోనే ప్రజలకు నూటికి నూటిశాతం సంక్షేమ పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నారు. వైఎస్సార్‌తో ఏ ముఖ్యమంత్రీ సాటి రారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో YSRTPని గెలిపిస్తే, మళ్లీ వైఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తామన్నారు. అధికారంలోకి వస్తే రైతులు, పేదల సంక్షేమం కోసం కొత్త పథకాలను తీసుకొస్తామన్నారు షర్మిల. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం వేయలేదని, మళ్లీ అలాంటి పాలన కావాలంటే YSRTP అధికారంలోకి రావాలని షర్మిల పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..