Telangana: హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సామావేశాలు.. రాబోయే ఎన్నికలపై ప్రధాన చర్చ..

Youth Congress: తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు . శివసేన రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర పై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు చేపట్టబోతుందన్నారు. యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నామన్నారు.

Telangana: హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సామావేశాలు.. రాబోయే ఎన్నికలపై ప్రధాన చర్చ..
Youth Congress

Edited By: seoteam.veegam

Updated on: Jun 07, 2023 | 3:57 PM

మొదటి సారి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయని తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు . శివసేన రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర పై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు చేపట్టబోతుందన్నారు. యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నామన్నారు. గజ్వేల్ నుంచి బస్సు యాత్ర చేస్తామన్నారు. యూత్ కమిషన్ ద్వారా నిరుద్యోగులు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేసే విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో యూత్‌కు టిక్కెట్ల ఇచ్చే విషయాన్ని కూడా ఈ సమావేశాల్లో చర్చి చేస్తామన్నారు.

యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్‌ 7, 8, 9 తేదీలల్లో హైదరాబాద్‌ క్షత్రియ హోటల్‌లో ఈ సమీక్ష సమావేశాలు మొదలయ్యాయి. 29 రాష్ట్రాలతో పాటు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కార్యవర్గ సమావేశాలలో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.

యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, 33 రాష్ట్రాల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతారని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం