AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ స్వాధీనం చేసుకున్నారనీ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్న యువకుడు

రోడ్లపై ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసులు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగంగా రోడ్లపై వెళ్లడం వంటి వాటి విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఈ క్రమంలో చలాన్లు విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం కూడా చేస్తుంటారు. అయితే తాజాగా అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్‌ణు స్వాధీనం చేసుకొని..

Hyderabad: ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ స్వాధీనం చేసుకున్నారనీ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్న యువకుడు
Traffic Police
Srilakshmi C
|

Updated on: Sep 11, 2024 | 12:03 PM

Share

శంషాబాద్‌, సెప్టెంబర్‌ 11: రోడ్లపై ప్రయాణికుల భద్రత దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసులు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగంగా రోడ్లపై వెళ్లడం వంటి వాటి విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారు. ఈ క్రమంలో చలాన్లు విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం కూడా చేస్తుంటారు. అయితే తాజాగా అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బైక్‌ణు స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో మనస్తాపం చెందని సదరు యువకుడు పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్‌- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్‌ మండలం తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద మంగళవారం (సెప్టెంబర్‌ 10) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్‌ మండలం తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై అతివేగంతో వస్తున్న యువకుడిని ఆపి చెక్‌ చేశారు. అనంతరం బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ యువకుడు బండి తిరిగివ్వకుంటే చనిపోతానంటూ పోలీసులను భయపెట్టాడు. రోడ్డుపై పరుగులు తీస్తూ వాహనాలకు అడ్డుగా వెళ్లాడు. పోలీసులు దొరక బుచ్చుకోవడంతో శరీరంపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి, అతడిని కాపాడారు. ఈ ఘటనలో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడిని నాగర్‌కర్నూల్‌కు చెందిన శివగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, రోడ్డుపై ప్రమాదకర రీతిలో వేగంగా బైక్‌ నడిపినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో అతడు నిందితుడుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడు శివపై కేసు నమోదు చేసి, 108లో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు.

మెదక్‌ సర్కిల్‌ శివంపేట సెక్షన్‌ ఏఈపై సస్పెన్షన్‌ వేటు

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) సీఎండీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా మెదక్‌ సర్కిల్‌ శివంపేట సెక్షన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ బి. దుర్గాప్రసాద్‌ను మంగళవారం అధికారులు సస్పెండ్‌ చేశారు. ఓ పనికి సంబంధించి వర్క్‌ ఆర్డర్‌ విడుదల చేయడానికి దుర్గాప్రసాద్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చింది. విచారణలో ఆరోపణలు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. కాగా గతంలోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడినందుకు విద్యుత్తు సంస్థలో 19 మందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్తు సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 040-2345 4884, 7680901912 కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!