
హైదరాబాద్: పెళ్లి కావడం లేదని నిరాశ చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి చనిపోయాడు. నాంపల్లి రైల్వే పోలీసులు వివరాల ప్రకారం ఎంఎస్‌మక్తాకు చెందిన షేక్ హైదర్‌కు 31 ఏళ్ల మహమ్మద్ సాబేర్ నాలుగో సంతానం.
పెయింటింగ్ పనులు చేసే సాబేర్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇతని పెళ్లి విషయం కుటుంబ సభ్యులెవ్వరూ పట్టించుకోవడం లేదని తరచూ స్నేహితుల వద్ద బాధపడేవాడు. శుక్రవారం స్నేహితుల వద్ద బాధపడి ఉదయం 8 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంఎంటీఎస్ రైలు సమీపంలోకి రాగానే పరిగెత్తి వెళ్లి పట్టాలపై తలపెట్టాడు. అందరూ చూస్తుండగానే అతని తల, మొండెం విడిపోయాయి. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.