Telangana: బావిలో ఈత కొడుతుండగా యువతికి ఫిట్స్.. ఆ తర్వాత

ఈత తనకి బాగా వచ్చు. ఎప్పుడు గ్రామానికి వచ్చినా ఫ్రెండ్స్‌తో కలిసి ఈతకు వెళ్తుంది. కానీ ఈసారి తాను ఈత కొడుతుండగా ఫిట్స్ రావడంతో.. అనుకోని రీతిలో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: బావిలో ఈత కొడుతుండగా యువతికి ఫిట్స్.. ఆ తర్వాత
Akhila

Updated on: May 05, 2025 | 2:06 PM

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువతి అనుకోని రీతిలో మరణించిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూర్ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కంట అఖిల అనే యువతి శనివారం ఉదయం ఫ్రెండ్స్‌తో కలిసి ఊరు శివారులో ఉన్న ఓ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లింది. సరదాగా అందరితో కలిసి ఈత కొడుతున్న సమయంలో అఖిలకు ఒక్కసారి పిట్స్ వచ్చాయి. దీంతో బావిలో కొట్టుమిట్టాడింది. బావిలో ఉండటంతో.. తోటి స్నేహితులు కూడా ఏం చేయలేకపోయారు.  వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన బావి నుంచి బయటకు తీసి… అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో.. యువతి మార్గం మధ్యలో మృతి చెందింది. మృతురాలు అఖిల హైద్రాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అందరితో కల్మషం లేకుండా ఉండే అఖిల మృతితో చిన్నమడూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి