Telangana: యాడ వెతికినా పెళ్లికి పిల్ల దొరకట్లే.. విసిగిపోయి ఉసురు తీసుకున్నాడు..

36 ఏళ్లు వచ్చాయ్.. అయినా పెళ్లి కావడం లేదన్న వ్యధతో ఓ యువకుడు తనువు చాలించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు తెలుసుకుందాం పదండి....

Telangana: యాడ వెతికినా పెళ్లికి పిల్ల దొరకట్లే.. విసిగిపోయి ఉసురు తీసుకున్నాడు..
Bhaskar

Edited By:

Updated on: Dec 10, 2024 | 1:54 PM

కొంతమంది యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులు స్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కొందరు, ప్రేమించిన వారు దక్కలేదని మరికొందరు చనిపోతుంటే.. మరికొంతమంది మాత్రం వయసు పెరుగుతున్నా తమకు పెళ్లికావడం లేదని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు.. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం..అయితే తాజాగా సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన సంగు భాస్కర్.. 36 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి అవ్వడం లేదని సూసైడ్ చేసుకున్నాడు.భాస్కర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అతడికి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నాడు. తనకు తెలిసిన వారితో పాటు, మ్యారేజ్ బ్యూరోలను సంప్రదించానా ప్రయోజనం లేకుండా పోయింది. తనకు పెళ్లికి ఎక్కడా అమ్మాయి దొరికపోవడంతో మనోవేదనకు గురయ్యాడు భాస్కర్. ఆదివారం రోజు రాత్రి డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చిన భాస్కర్.. అదే రోజు ఇంట్లోని తన గదిలో ఉన్న ఫ్యాన్‌కి ఉరేసుకొని తనువు చాలించాడు.

ఉదయం గది తలుపులు తెరిచి చూసిన కుటుంబ సభ్యులు అతడు విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడటం చూసి.. షాక్‌కు గురయ్యారు. పెళ్లి కావట్లేదని మనస్తాపంలో తన కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎంతో విలువైన ప్రాణాన్ని ఇలా క్షణికావేశంలో తీసుకొని కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు భాస్కర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..