Telangana: వీడిపోయిన భార్య.. రెండో పెళ్ళి చేసుకుందని.. ఓ భర్త ఏం చేశాడో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Aug 25, 2024 | 11:54 AM

నల్గొండ జిల్లా నిడమనూరులో దారుణం జరిగింది. కన్న కొడుకే తల్లిని హత్య చేసి తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటు చేసుకుంది.

Telangana: వీడిపోయిన భార్య.. రెండో పెళ్ళి చేసుకుందని.. ఓ భర్త ఏం చేశాడో తెలుసా..?
Murder
Follow us on

నల్గొండ జిల్లా నిడమనూరులో దారుణం జరిగింది. కన్న కొడుకే తల్లిని హత్య చేసి తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటు చేసుకుంది. నిడమనూరుకు చెందిన సాయమ్మ, వీరయ్య దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. అయితే చిన్న కొడుకు శివకు అక్క కూతురు మేఘనతో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివ తరుచూ భార్య మేఘనతో గొడవ పడుతున్నాడు. రెండేళ్ల నుండి వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి.

కుల పెద్దలు, కుటుంబ సభ్యులు కలిసి పలుసార్లు పంచాయతీ చేసినప్పటికీ కలిసి ఉండలేక విడిపోయారు. ఆగస్ట్ 22వ తేదీన న్యాయస్థానం ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో మేఘన తల్లిదండ్రులు మిర్యాలగూడలో ఈ నెల 24వ తేదీన ఆమెకు రెండో వివాహం చేశారు. ఆ పెళ్ళికి కుటుంబ సభ్యులు వెళ్లడంతో నిడమనూరులోని ఇంటి వద్దే తల్లి సాయమ్మ, కొడుకు శివ ఉన్నారు.

మేఘనకు రెండో వివాహం జరుగుతుండడంతో.. శనివారం(ఆగస్ట్ 24) ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న శివ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి సాయమ్మ గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లికి వెళ్లి ఉదయం తిరిగి వచ్చిన మృతుని తండ్రి వీరయ్య చూసే సరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..