మొన్న కర్నూల్‌.. నిన్న వికారాబాద్‌.. నేడు గద్వాల్‌ జిల్లాలో.. కలవరపడుతున్న రైతులు

|

May 14, 2022 | 7:25 AM

మొన్న కర్నూల్‌.. నిన్న వికారాబాద్‌.. నేడు గద్వాల.. ఇలా జరగడం రైతులను కలవరపెడుతోంది. ముందే వర్షకాలం సమీపిస్తోంది. రైతులు..

మొన్న కర్నూల్‌.. నిన్న వికారాబాద్‌.. నేడు గద్వాల్‌ జిల్లాలో.. కలవరపడుతున్న రైతులు
Follow us on

మొన్న కర్నూల్‌.. నిన్న వికారాబాద్‌.. నేడు గద్వాల.. ఇలా జరగడం రైతులను కలవరపెడుతోంది. ముందే వర్షకాలం సమీపిస్తోంది. రైతులు పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇలా రోజుకోచోట దొరుకుతున్న నకిలీ పత్తి విత్తనాలు (Fake Seeds) రైతులను కలవరపెడుతున్నాయి. రైతు అడుగడుగునా దగాపడుతూనే ఉన్నాడనడానికి భారీగా దొరుకుతున్న నకిలీ విత్తనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొన్నటికిమొన్న కర్నూల్‌లో భారీగా నకిలీ పత్తివిత్తనాలు దొరికిన ఘటన మరువకముందే.. నిన్న వికారబాద్‌లో నకిలీ పత్తి విత్తనాలు దొరకడం కలకలం రేపింది. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో ఏకంగా 1675 కిలోల నకిలీ పత్తివిత్తనాలు లభించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలను తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. ప్యాకింగ్‌ వాడే మిషన్‌ను కూడా సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా విత్తనాల తయారీదారులను ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు ఎస్పీ రంజాన్‌రతన్‌. నకిలీ విత్తనాలు అమ్మినా.. రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వం ఎంతకఠినంగా ఉన్నా.. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. నకిలీలు మాత్రం చెలరేగిపోతూనే ఉన్నారు. అసలే పంటకు మద్దతు ధర రాక.. ప్రకృతి విపత్తులను దాటేందుకు నానాకష్టాలు పడుతున్న రైతుకు నకిలీ విత్తనాల బెడద మరింత ఆందోళన కలిగిస్తోంది. నకిలీవిత్తన తయారీదారులు, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేస్తున్నారు రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి