వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రతిపక్ష టీడీపీతో యుద్ధానికి దిగుతారు. టీడీపీ అధినేతతో పాటు.. పార్టీ కీలక నేతల్ని లక్ష్యంగా చేస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేస్తూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ ఏడాది పాలన కేవలం ట్రయలర్ మాత్రమేనని.. వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా ఉంటుందని.. దానిని చూసి ఏమవుతారో..? అంటూ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం విజయసాయి రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ చేశారు.
“జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 10, 2020