ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈవో పదవికి ఆమె రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లుగా దేవస్థానం ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.
2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం.. 1200 కోట్ల రూపాయలతో యాదాద్రిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరణ పనులు చేపట్టింది. ఈ పనుల పర్యవేక్షణకు యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్మెంట్ అథారిటీ (YTDA)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆమె యాదాద్రి ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2020లో పదవి విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది. అయితే ఆలయ ఈవో గీతపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావులు విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి.
అంతేకాదు ఆలయ నగరిలో నిర్మిస్తున్న దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గీతారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఆలయ పునర్నిర్మానం వల్ల భక్తులకు సేవలు, సౌకర్యాల కల్పనలో గీతారెడ్డి విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ విషయాలన్నింటిని సీరియస్‌గా తీసుకున్న దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…