తల్లిదండ్రుల తర్వాత గురువుకు విశిష్ట స్థానం ఇచ్చారు మన పెద్దలు. తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు, జ్ఞానం, సంస్కారం ఇచ్చి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయులు. అవును పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి రేపటి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ మహిళా టీచర్.. ఆ వృత్తికే కళంకంగా మారింది. విద్యార్ధులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు దిగింది. దాంతో ఈ టీచర్ మాకొద్దు బాబోయ్ అంటూ ఆ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో జరిగింది.
కొమురంభీం జిల్లా చింతలమానపల్లి మండలం రవింద్రనగర్ లో విద్యార్థులు ఈ టీచర్ మాకొద్దు బాబోయ్ అంటూ క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సవిత అనే లెక్కల టీచర్ ప్రత్యేక క్లాసులపేరుతో పిలిచి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. వీడియో కాల్ చేస్తూ తమను గుర్తుతెలియని వ్యక్తులకు చూపిస్తోందని, తమ ఫోటోలు వారికి పింపిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలిని తొలగించాలంటూ విద్యార్ధులు ఆందోళనచేపట్టారు. టీచర్ తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..