Telangana: మహిళకు చెప్పులదండ వేసి ఊరంతా ఊరేగించిన గ్రామస్తులు.. కారణం తెలిస్తే షాకే..

|

Feb 14, 2023 | 10:48 PM

ప్రవర్తన మార్చుకోవాలని మందలించిన బావపై దారుణానికి ఓడిగట్టింది ఓ మహిళా. ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్య చేయించింది. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: మహిళకు చెప్పులదండ వేసి ఊరంతా ఊరేగించిన గ్రామస్తులు.. కారణం తెలిస్తే షాకే..
Arrest
Follow us on

ప్రవర్తన మార్చుకోవాలని మందలించిన బావపై దారుణానికి ఓడిగట్టింది ఓ మహిళా. ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్య చేయించింది. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డ ఓ మహిళలను బావ మందలించిన పాపానికి దారుణానికి ఒడిగట్టింది. అచ్చం సినీ ఫక్కీలో స్కెచ్ వేసి నిందితులతో కలిసి బావను అతి కిరాతకంగా హత్య చేయించింది. కథ అడ్డం తిరగడంతో గ్రామస్థుల ముందు నేరం ఒప్పుకుంది. దీంతో గ్రామస్థులు ఊహించని సన్మానం చేశారు. మహిళ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు గ్రామస్తులు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లాలోని డోర్నకల్ మండలం సిగ్నల్ తండాలో జరిగింది.

తమ్ముడి భార్య ప్రవర్తన బాగాలేదని గమనించిన ఓ మహిళా బావ బాణోత్ రాజు.. ఆమెను మందలించాడు. భర్త చనిపోవడంతో భార్య చెడు తిరుగుళ్లకు అలవాటు పడింది. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఊర్లో పరువు తీస్తోందని రాజు కన్నె్ర్రజేశాడు. చెడు అలవాట్లు మానుకోవాలంటూ మందలించాడు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. పదే పదే మందలించినా మారకపోగా.. తన అక్రమ సంబంధాలు అడ్డొస్తున్న బావను అడ్డు తొలగించుకోవాలని భావించింది. అతని పగ పెంచుకున్న మరదలు.. ఇద్దరు యువకుల సహకారంతో అతన్ని చంపించింది.

అయితే, రాజు మిస్ అవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు, కూపీ లాగితే క్రైమ్ కథ అంతా బయటపడింది. రాజు డెడ్ బాడీ లభ్యమైంది. అయితే, పోలీసులు వచ్చేలోపల ఊళ్లో వాళ్లే విచారణ ప్రారంభించారు. జనం జడ్జీలయ్యారు. ఊరు కోర్టుగా మారింది. నేరం అంగీకరించడంతో పనిష్మెంట్ ఇచ్చారు గ్రామ పెద్దలు. మహిళ మెడలో చెప్పుల దండా వేసి గ్రామమంతా ఊరేగించారు. హత్యకు పాల్పడిన మహిళలతో పాటు నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..