
ఆమెకు తల్లి అంటే ప్రేమ. ఎంతో అనురాగం. అనారోగ్యంతో తల్లి కన్ను మూసింది. అయితే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసిన తరువాత అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఈమె మాత్రం వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. సుమారుగా 24 గంటలు అక్కడే ఉండిపోయారు. బలవంతంగా తీసుకొచ్చిన మళ్లీ అక్కడికే వెళ్తామని చెబుతున్నారు.
కరీంనగర్‌లోని సవరన్ షీట్ కబరస్థాన్(స్మశాన వాటిక)లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. అజ్మత్‌పూర్‌కు చెందిన హసీనా ఆరోగ్యం బాగా లేదు. కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించడంతో కన్ను మూశారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమార్తె ఆఫ్రిన్ కుమిలిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రి మొత్తం తన తల్లి సమాధి వద్దే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కనీసం 24 గంటల పాటు అక్కడే ఉంది.
రాత్రి అక్కడే ఉంటోంది. కుటుంబ సభ్యులు ఎంత వెనక్కి తీసుకొచ్చినా మళ్ళీ అక్కడికే వెళ్తుంది. రాత్రి పూట ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రిన్ తండ్రి.. కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం స్మశాన వాటికకు చేరుకుని ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. బలవంతంగానే ఇంటికి వెళ్ళింది. ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కుటుంబం సభ్యులు.