Khammam: భర్త మోసం చేశాడని భార్య వినూత్న నిరసన..న్యాయం కోసం వాటర్‌ట్యాంక్‌ ఎక్కిన యువతి

|

Mar 04, 2022 | 1:36 PM

Khammam: రోజు రోజుకే పెళ్ళికి, భార్యాభర్తల(Wife and Husband)అనుబంధానికి  అర్ధం మార్చేస్తున్నారు కొంతమంది. జీవితాంతం కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసి.. వైవాహిక బంధంలో..

Khammam: భర్త మోసం చేశాడని భార్య వినూత్న నిరసన..న్యాయం కోసం వాటర్‌ట్యాంక్‌ ఎక్కిన యువతి
Wife Protest Against Husban
Follow us on

Khammam: రోజు రోజుకే పెళ్ళికి, భార్యాభర్తల(Wife and Husband)అనుబంధానికి  అర్ధం మార్చేస్తున్నారు కొంతమంది. జీవితాంతం కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసి.. వైవాహిక బంధంలో అడుగు పెట్టిన యువతీయువకులు చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు. కొంతమంది తాము చేసుకున్నవారికి వదిలేస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి న్యాయం(Wife protest) కావాలంటూ వినూత్నంగా ధర్నా చేసింది.. అంతేకాదు తనకు న్యాయం కావాలంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కింది. ఈ ఘటన ఖమ్మం(Khammam)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం గ్రామానికి చెందిన మౌనిక గత రెండు నెలల క్రితం వీరబాబు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే తనను భర్త ఇంటికి రానివ్వడం లేదని.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనను తన భర్త అత్తారింటికి తీసుకుని వెళ్లాలని.. తనను ఇంటికి రానివ్వాలంటూ..ఖమ్మం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరున్న వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి నిరసన తెలిపింది. తన భర్త తనకు కావాలని డిమాండ్‌ చేస్తోంది మౌనిక. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎట్టకేలకు వాటర్‌ ట్యాంక్‌ నుంచి యువతిని కిందకి దింపారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Also Read:

 అడవికి రాజే కావొచ్చు.. నేను ఎంట్రీ ఇస్తే తోక ముడవాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

శ్రీవారి భక్తులకు చైర్మన్ సుబ్బారెడ్డి శుభవార్త.. ఆ సేవల ధరల పెంపు ఆలోచన లేదని స్పష్టీకరణ