అప్పటికే అతనికి ఇద్దరు భార్యలు. అయినా ప్రవర్తన మార్చుకోలేదు. రెండో భార్య చెల్లిని ప్రేమించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో అనుమానం పెంచుకున్నాడు. తరచూ వేధించేవాడు. అయినా కోపం చల్లారక చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే నిర్మాణంలో ఉన్న భవనంలోకి మూడో భార్యను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అనంతరం ప్రవర్తన మార్చుకోవాలని భార్యకు సూచించాడు. ఆమె మాట వినకపోవడంతో సెంట్రింగ్ చెక్కతో కొట్టి దారుణంగా హత్య(Murder) చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఐదు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో భర్తే భార్యను హత్య చేసినట్లు నిర్ధరించారు.
కూలీ పనులు చేసుకునే యాదగిరి.. మొదటి భార్య ఉండగానే స్రవంతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్రవంతి చెల్లిని కూడా ప్రేమించినట్లు నట్టించి, గుడిలో మూడో పెళ్లి చేసుకున్నారు. స్రవంతి, రేఖలది చెన్నై కాగా జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. రేఖపై అనుమానం పెంచుకున్న యాదగిరి ఆమెను తరచూ వేధించేవాడు. దీంతో రేఖను చంపేయాలని నిర్ణయించుకుని, భరత్‌నగర్‌కు తీసుకొచ్చాడు. భవనం టెర్రస్ పైకి రేఖను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో ఇష్టం వచ్చినట్టు తిరగొద్దని భార్యను యాదగిరి హెచ్చరించాడు. రేఖ వినకపోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన యాదగిరి అక్కడే ఉన్న సెంట్రింగ్ చెక్కతో రేఖ తల, కాళ్లు, చేతులపై కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందన్న సమచారంతో లక్డీకాపూల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉండడంతో హత్య జరిగి రెండు, మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావించారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మహిళను వెంట బెట్టుకుని వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి, మహిళను చంపింది ఆమె భర్తేనని నిర్థరించుకున్నారు. యాదగిరి ని అదుపులోకి తీసుకుని విచారించగా.. రేఖను తానే హత్య చేశానని ఒప్పకున్నాడు. భార్యపై అనుమానం, ఎంత నచ్చచెప్పినా వినడంలేదని భర్తే కొట్టి చంపాడని తెలిసినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
Also Read
Stock Market: T+1 సెటిల్‌మెంట్‌కు సన్నాహాలు.. మొదటగా కొన్ని స్టాక్‌ల్లోనే..