Viral Video: సన్నిలియోన్‌ సాంగ్‌ ఎంత పని చేసిందిరో..! పెళ్లి వేదికపై యువకుల డాన్స్‌ అదుర్స్‌.. అంతలోనే సీన్ సితార అయింది.. వీడియో

Viral Video: సన్నిలియోన్‌ సాంగ్‌ ఎంత పని చేసిందిరో..! పెళ్లి వేదికపై యువకుల డాన్స్‌ అదుర్స్‌.. అంతలోనే సీన్ సితార అయింది.. వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 24, 2022 | 9:42 AM

ఈ రోజుల్లో వివాహవేడుకలకి సంబంధించినఅనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. పెళ్లి వేదికలపై వధూవరులు, బంధువులు, యువకులు చేసే డాన్సులు, అల్లర్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. వివాహ వేడుకలకు హాజరు కాలేకపోయినా


ఈ రోజుల్లో వివాహవేడుకలకి సంబంధించినఅనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. పెళ్లి వేదికలపై వధూవరులు, బంధువులు, యువకులు చేసే డాన్సులు, అల్లర్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. వివాహ వేడుకలకు హాజరు కాలేకపోయినా ఇలాంటి వీడియోలతో చాలా మంది ఆ లోటును మర్చిపోతుంటారు. తాజాగా వివాహ వేడుకలలో చేసిన డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు వేదికపై డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో మరో అబ్బాయి కూడా వచ్చి వీరితో కలుస్తాడు. అప్పుడు ముగ్గురు కలిసి సన్నిలియోన్‌ సాంగ్‌కి ఓ ప్రత్యేక స్టంట్‌ చేయడానికి ప్రయత్నించారు. ముగ్గురిలో ఒక వ్యక్తి మిగతా ఇద్దరని పట్టుకొని గుండ్రంగా తిరుగుతుంటాడు. రెండు, మూడు సార్లు బాగానే తిరిగినప్పటికీ చివరి రౌండ్‌లో ఒక అబ్బాయి ఎగిరి కిందపడిపోతాడు. దీంతో పాపం వారు చేయాలనుకున్న స్టంట్‌ ఫెయిలయిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ‘ఈ వీడియో ప్రతిచోటా విన్యాసాలు చేసేవారికి ఒక గుణపాఠం’అంటే.. ‘అన్నిచోట్లా విన్యాసాలు చేయలేమని ఈనాటి పిల్లలు ఎందుకు అర్థం చేసుకోలేరు’అంటూ కామెంట్‌ చేశాడు. ఆ ఫన్నీ వీడియోని మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..