Gold Coins: రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటుంటే.. మధ్యలో వచ్చిన కోతి ఆ రెండింటినీ బకరా చేసి రొట్టే ముక్కను లాగించేసిందన్నట్లు.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కొందరు కూలీల పరిస్థితి కూడా అలాగే తయారైంది. బాత్రూమ్ కోసం తవ్వకాలు జరుపుతుండగా.. బంగారు నాణెలు బయటపడగా వాటికి గుట్టుచప్పుడు కాకుండా పంచుకునే ప్రయత్నం చేశారు కొందరు కూలీలు. అయితే, పంపకాల్లో వచ్చిన తేడా వల్ల ఆ నాణెలు చివరికి ప్రభుత్వం చేతికి చిక్కాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలోని మానపాడు మండల కేంద్రంలో ఇంట్లో బాత్రూమ్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. కొందరు కూలీలు దీనికి సంబంధించి పునాదుల తవ్వకాలు జరిపారు. అయితే, ఈ తవ్వకాల్లో ఊహించని రీతిలో బంగారు నాణెలు బయటపడ్డాయి. అది గమనించిన ఆ కూలీలు ఇంటి యజమానికి తెలియకుండా దొరికిన బంగారు నాణెలను తీసుకున్నారు. దాదాపు 100 నాణెలు దొరకగా.. వాటిని గుట్టుచప్పుడు కాకుండా దాచుకున్నారు. అనంతరం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది జరిగి నెల రోజులు కాగా.. తాజాగా పంపకాల విషయంలో తేడా రావడంతో విషయం బయటపడింది. అది కాస్తా అధికారుల వరకూ వెళ్లడంతో.. అధికారులు విచారణ చేపట్టారు. పలువురు కూలీలను అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి ఆ బంగారు నాణెలను స్వాధీనం చేసుకున్నారు.
Also read:
Road Accident: మొత్తం ఏడు కార్లు.. ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయ్.. ముంబై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..
చతికిలబడిన గబ్బర్ సేన.. మూడేళ్ల తర్వాత భారత్‌పై లంక విజయం.. సిరీస్ 1-1తో సమం..