Weekend Hour: టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో ఉగ్రరూపం ప్రదర్శించిన కేసీఆర్

ఎన్‌డీయే అంటూ నో డేటా అవెలబుల్‌ అంటూ విమర్శించిన కేసీఆర్‌...2024 తర్వాత బీజేపీ పుట్టి మునగడం ఖాయమని అన్నారు. జనాభా లెక్కలు తీయకపోవడం నుంచి వరుస పెట్టి... బీజేపీ వైఫల్యాలపై పదునైన విమర్శలు చేశారు సీఎం కేసీఆర్‌.

Weekend Hour:  టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో ఉగ్రరూపం ప్రదర్శించిన కేసీఆర్
Weekend Hour

Updated on: Feb 12, 2023 | 7:09 PM

మిషన్‌-2024. టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో ఉగ్రరూపం ప్రదర్శించారు కేసీఆర్. ఇన్ని రోజులు ఒక లెక్క..ఇకపై మరో లెక్క అన్నట్లుగానే సాగింది స్పీచ్. డైరెక్ట్‌గా అటాక్‌ చేశారు. మోదీపై పంచ్‌ల వర్షం కురిపించారు. మాటల మిసైళ్లు పేల్చారు. ఇప్పటి వరకు ఇంత చెత్త ప్రధానిని చూడలేదంటూ..అసెంబ్లీ సాక్షిగా అంకుశాలు ఎక్కుపెట్టారు. దేశానికి లక్ష్యం ఉందా? విమర్శిస్తే ఈడీ,బోడీలతో బెదిరిస్తారా? పదేళ్లలో మీరు ఏం సాధించారు? మీ కంటే మన్మోహన్ 100 శాతం బెటర్‌ అంటూ లెక్కలతో సహా వివరించారు. రెండున్నర గంటల పాటు సాగిన కేసీఆర్‌ ప్రసంగం 90 శాతం మోదీ, కేంద్రం చుట్టూనే తిరిగింది. గత 8 ఏళ్లలో దేశం ఏం కోల్పోయిందో చెబుతూనే.. ఎకానీమ పరంగా నష్టాలు వివరించారు. లెక్కలు, అంకెలు, రాజకీయ విమర్శలతో అన్‌స్టాపబుల్‌గా విరుచుకుపడ్డారు.