Telangana: కూల్ న్యూస్.. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే IMD అంచనా వేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు,మెరుపులతో పాటు పిడుగులు పడొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Telangana: కూల్ న్యూస్.. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
Andhra and Telangana Weather

Updated on: Jul 05, 2024 | 11:35 AM

తెలంగాణకు కూల్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలో రుతుపవనాలు బాగా యాక్టివ్ అయ్యాయని.. నైరుతి రుతపవనాలకు తోడు ఉపరితలగాలులు వీస్తున్నాయని.. ఇకపై దండిగా వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా.. భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది. జులై 7, ఆదివారం రోజున ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ.. జులై 8, సోమవారం రోజున ములుగు, మహబూబాబాద్,  కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి,  వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇతర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

కాగా, ఈ ఏడాది నైరుతి.. అంచనా వేసిన సమయాని కంటే ముందుగానే కేరళకు తాకి.. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. అయితే, వర్షాలు మాత్రం పెద్దగా కురవలేదు. అయితే జులైలో మంచిగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతులు పొలం పనులు షురూ చేశారు. విత్తు పెట్టేందుకు సిద్దమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…