Water Intoxication: నీరు ఎక్కువగా తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న మహిళ.. నీటి మత్తు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా..

|

Dec 24, 2024 | 9:21 AM

అతి సర్వత్రా వర్జయేత్ అన్న సామెతను అనేక విషయాలు గుర్తు చేస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి నీరు ముంచివే.. రోజులో తగినంత నీరు తాగడం వలన ఆరోగ్యంగా ఉంటాం. అయితే నీరు తాగమన్నారు కదా అంటూ అదే పనిగా నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం.. ఇందుకు సజీవ సాక్షంగా నిలిచింది హైదరబాద్ కు చెందిన ఓ మహిళా. నిద్ర లేచిన వెంటనే అధికంగా నీరు తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ విషయంలో వైద్యుల సలహా ఏమిటంటే

Water Intoxication: నీరు ఎక్కువగా తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న మహిళ.. నీటి మత్తు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమా..
Water Intoxication
Follow us on

ప్రస్తుతం రోజూ నిద్ర లేచిన వెంటనే నీరు తాగడమే కాదు రోజులో సుమారు నాలుగు లీటర్ల నీరు తాగమంటూ వార్తలు ఓ రేంజ్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్నీ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా అమలు చేయాలనీ కోరుకుంది. 40 ఏళ్ల మహిళ నిద్రలేచిన వెంటనే దాదాపు 4 లీటర్ల నీరు తాగింది. తర్వాత ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై అపోలో హాస్పిటల్స్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అనేక విషయాలను పంచుకున్నారు. ఎక్కువ మొత్తంలో నీరు తాగడంతో ఆ మహిళ తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. “ఉదయం నిద్రలేచిన వెంటనే తగిన మొత్తంలో నీటిని తాగడం వలన శరీరం నుంచి అన్ని వ్యర్థాలు తొలగిపోతాయని డాక్టర్ కుమార్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో వెల్లడించారు.

డాక్టర్ కుమార్ బాధితురాలి గురించి మాట్లాడుతూ.. నీరు త్రాగిన కొన్ని నిమిషాల తర్వాత.. ఆమెకు అసలు ఏమి జరుగుతుందో తెలియని స్టేజ్ కు చేరుకుందని.. గందరగోళంగా అనిపించడం ప్రారంభించిందని, ఆ తర్వాత మూర్ఛ వచ్చి స్పృహ కోల్పోయిందని చెప్పారు. ఆ మహిళా ఏ వ్యాధి బారిన పడిందో రోగ నిర్ధారణలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆమె నీటి మత్తు బారిన పడిందని.. అంటే వాటర్ పాయిజనింగ్ బారిన పడినట్లు వెల్లడించారు. రక్త పరీక్ష లో తమ అనుమానాన్ని నిర్ధారణ అయినది అని చెప్పారు. ఆమెకు సీరమ్ సోడియం స్థాయిలు 110 mmol/L ఉన్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు.

నీటి మత్తు అంటే ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం అవసరం లేకుండా నీరు త్రాగడం వల్ల నీటి మత్తు ఏర్పడుతుంది. అప్పుడు తీవ్రమైన రసాయన అసమతుల్యతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. అయితే శరీరానికి చెమటలు పట్టడం లేదా మూత్రవిసర్జన చేయడం ద్వారా కూడా సహజంగా నీరు శరీరం నుంచి బయటకు వెళ్లదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ నీరు త్రాగడం వల్ల రక్తం పలచన అవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లు తగ్గుతాయి. ఇది సోడియం (ఉప్పు) వంటి ఎలక్ట్రోలైట్స్ (రక్తంలోని ఖనిజాలు, విద్యుత్ చార్జ్‌ను మోసే ఇతర శరీర ద్రవాలు) అసమతుల్యతకు దారితీస్తుంది. ఫలితంగా నీరు శరీర కణాలలోకి వెళ్లి వాటిని ఉబ్బేలా చేస్తుంది. మెదడు కణాలలో ఎక్కువ నీరు చేరుకుంటే మెదడుపై ఒత్తిడిని పెరుగుతుంది. మెదడుని ప్రభావితం చేస్తుంది. అప్పుడు అవగాహన, కదలిక, ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది. ఒకొక్కసారి నీటి మత్తు ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

నీటి మత్తు సంకేతాలు, లక్షణాలు ఏమింటే

  1. వికారం, వాంతులు
  2. కడుపు ఉబ్బరం
  3. తలనొప్పి
  4. నిద్రమత్తు
  5. కండరాల బలహీనత, నొప్పి , తిమ్మిరి
  6. గందరగోళం, చిరాకు, మైకముతో సహా మానసిక స్థితిలో మార్పులు
  7. చేతులు, పాదాలు, బొడ్డులో తీవ్రమైన వాపు

ఎక్కువ నీరు తాగుతున్నారో లేదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అయితే విసర్జించే మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి అనేక విషయాలు చెబుతుంది. శరీరం హైడ్రేట్ కాకపోతే మూత్రం లేత పసుపు రంగు లేదా నిమ్మరసం వంటి లేత పసుపు రంగులో ఉంటుంది. మూత్ర విసర్జన రంగు లేకుండా లేదా స్పష్టంగా ఉంటే చాలా నీరు త్రాగవచ్చు. మూత్రం రంగులేకుండా.. స్పష్టంగా ఉంటే ఇక నీరు తాగడం ఆపమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఎంత నీరు ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీస్తుంది?

ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితులు నీటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. వైద్యుల ప్రకారం శరీరంలో ఎక్కువ నీరు ఉంది అని తెలుసుకోవడానికి శరీరం నీటిని ఎలా ఉపయోగిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ముత్ర విసర్జ ద్వారా శరీరం నుంచి అదనపు నీరు తొలుగుతుంది. ఒక రోజులో చేసే మూత్ర విసర్జన దాదాపు 1-2 లీటర్లకు సమానం.

కొద్ది మందిలో ఒక గంట లేదా రెండు గంటల పాటు 3-4 లీటర్లు తాగిన తర్వాత నీటి మత్తు లక్షణాలు ఎక్కువ అవుతాయి. కనుక ఓవర్‌హైడ్రేషన్‌ను నివారించడంలో కొన్ని లక్షణాలు గుర్తిస్తే అవి సహాయపడవచ్చు.

దాహం వేసినప్పుడు తాగడం

దాహం తీర్చిన తర్వాత నీరు తాగడం ఆపాలి. ఎక్కువ నీరుని బలవంతంగా తగవద్దు.

వికారం, ఉబ్బరం లేదా తలనొప్పి అనిపిస్తే నీరు తాగడం ఆపవద్దు.

నీటి మత్తుకు ఎలా చికిత్స చేస్తారంటే.. నీటి మత్తును నివారించేందుకు కొన్ని మార్గాలు

ఎక్కువ నీటి తాగడం ఆపెయ్యడం.. లేదా నీటిని పరిమితంగా తాగడం

నీటి మత్తుకి తగిన చికిత్స అందించాలి. నీటి మత్తుకు గల కారణాన్ని బట్టి.. వైద్యులు శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళే విధంగా మూత్రవిసర్జన కు మందులు ఇవ్వడం లేదా IV ద్రవాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి