AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం వింత గురూ.. ఒక కోడిగుడ్డు నుంచి పుట్టిన 2 పిల్లలు..

కోడికి కవలలు పుట్టాయండి.. ఏంటీ వింత అనుకుంటున్నారా...? నిజంగానే వింత ఘటన. ఈ విషయం స్థానికంగా చర్చనీయంశమైంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామంలో ఈ అరుదైన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ కోడి కవలలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.

Telangana: ఇదేం వింత గురూ.. ఒక కోడిగుడ్డు నుంచి పుట్టిన 2 పిల్లలు..
Chick
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2024 | 9:22 AM

Share

ఈ ప్రపంచం ఎన్నో వింతల సమాహారం. రోజూ ఏదో ఓ మూలన.. కొత్త వింతలు వెలుగుచూస్తూనే ఉంటాయి. కొన్ని ఘటనలు మరీ ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. బోథ్ మండలం సొనాల గ్రామంలో.. ఓ కోడి పొదిగిన గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయి. సోనాలకు చెందిన తోఫిక్.. కోళ్ల పెంపకం చేస్తూ ఉంటాడు. వాటిలో ఇటీవల ఒక కోడి గుడ్లను పొదిగింది. అయితే సోమవారం రోజున ఒక గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటకు రావడంతో తోఫిక్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ పిల్లలు కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు.

ఒక గుడ్డు నుంచి రెండు కోడి పిల్లలు పుట్టాయన్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కవల కోడి పిల్లలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి ఘటన గురించి తామెప్పుడూ వినలేదు, చూడలేదు అంటున్నారు. కాగా ఈ వింతపై స్థానిక పశు వైద్యాధికారి సుశీల్ కుమార్​ మాట్లాడుతూ జన్యుపరమైన లోపాలతో ఇలా.. ఒక గుడ్డు నుంచి  2 పిల్లలు పుట్టే ఆస్కారం ఉందన్నారు. ఇలాంటివి చాలా అరుదని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సైతం కోడికి కవలలు పుట్టాయి తమ బంధువులకు, మిత్రులకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఆ ఫోటోలను వాట్సాప్‌తో ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు.

ఇక ఇటీవల  నిజామాబాద్ జిల్లాలోనూ ఈ మాదిరి ఘటనే వెలుగుచూసింది.  మంగళ్ పహాడ్ గ్రామంలో ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక మేక పిల్ల… తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టింది. ఇది కూడా జన్యుపరమైన లోపమే అంటున్నారు పశువైద్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?