Covid 19 Vaccine: కరోనా సెకండ్ డోస్ వేయట్లేదని వాచ్‌మన్ ఆగ్రహం.. ఏకంగా ఆరోగ్య కేంద్రంలోనే..

|

Jul 03, 2021 | 6:55 AM

Covid 19 Vaccine: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో జనాలు అంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మొదట్లో కోవిడ్ వ్యాక్సీన్ అంటేనే భయాందోళనకు...

Covid 19 Vaccine: కరోనా సెకండ్ డోస్ వేయట్లేదని వాచ్‌మన్ ఆగ్రహం.. ఏకంగా ఆరోగ్య కేంద్రంలోనే..
Covid 19 Vaccine
Follow us on

Covid 19 Vaccine: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో జనాలు అంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మొదట్లో కోవిడ్ వ్యాక్సీన్ అంటేనే భయాందోళనకు గురైన ప్రజలు.. ఇప్పుడు వ్యాక్సీన్ ఎంత అవసరమో గ్రహించి వ్యాక్సీన్ వేయించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. తాజాగా.. కోవిడ్ వ్యా్క్సీన్ ఫస్ట్ డోస్ వేసుకున్న ఓ వ్యక్తి.. మూడు నెలల తరువాత వచ్చి తనకు సెకండ్ డోస్ వేయాలంటూ అధికారులను కోరాడు. ఇప్పుడు లేదంటూ వైద్యాధికారులు చెప్పడంతో సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా పురుగుల మందు డబ్బాను వెంట తీసుకువచ్చి ఆస్పత్రి ఎదుటే కూర్చుని నిరసనకు దిగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వైద్యాధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మ దావిద్ అనే వ్యక్తి చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దావిద్‌కు ఫస్ట్ డోస్ వ్యాక్సీన్ వేశారు. అప్పటి వరకు బాగానే ఉంది.

యితే, కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక అతనిలో భయం మొదలైంది. తనకు టీకా సెకండ్ డోస్ వేయాలని ఆస్పత్రి వైద్యులను కోరాడు. అయితే, సెకండ్ డోస్‌కు ఇంకా సమయం పడుతుందని ఆస్పత్రి అధికారులు దావిద్‌కు చెబుతూ వచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన దాదావిడ్ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆస్పత్రి వద్దకు వచ్చాడు. తనకు సెకండ్ డోస్ వ్యాక్సీన్ వేయాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కరోనా టెస్ట్‌ల కోసం అనేక మంది ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని, తానూ అక్కడే విధులు నిర్వహిస్తుండటంతో వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున సెకండ్ డోస్ వేయాలని కోరినట్లు దావిద్ తెలిపాడు. కాగా, విషయం తెలుసుకున్న స్థానికులు దావిద్‌కు సపోర్ట్‌గా ఆస్పత్రికి వచ్చి వారు కూడా ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై ఆస్పత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. దావిద్ సహా ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు. దావిద్‌కు నచ్చజెప్పి అతని భయాందోళనలను తొలగించారు.

Also read:

Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో..