Watch Video: అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో

|

Jul 25, 2024 | 6:49 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై వాహనదారులుత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ​‌నగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేరు వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా..

Watch Video: అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో
RTC bus accident
Follow us on

అదిలాబాద్‌, జులై 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై వాహనదారులుత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ​‌నగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేరు వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రెండు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఓ బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ​క్రమంలో ఆ బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి సుమారు వంద మందికిపైగా ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్న జేసీబీ సాహాయంతో వాహనాలను తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరో ఘటన.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి అనిల్‌ అనే రైతు పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దును బస్సు ఢీ కొట్టింది. దీంతో ఎద్దు మృతిచెందింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.