Watch Video: పెట్రోల్ బంక్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎగసిపడుతున్న మంటలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.ఈ ఘటనలో డ్రైవర్ బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.ఈ ఘటనలో డ్రైవర్ బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. సుమారుగా అరగంట ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మంటలు అర్పడానికి.. ఫైర్ సిబ్బంది ప్రయత్నలు చేసింది. అర్ధ గంట తరువాత.. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




