Telangana: ఎన్నడూ చూడని వింత.. పాప కంటి నుంచి ఉబికి వస్తున్న బియ్యం, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు

మహబూబాబాద్ జిల్లాలో ఆరేళ్లపాపకి భరించలేని కష్టం వచ్చింది. కంటి నుంచి నిరంతరాయంగా వ్యర్థాలు వస్తున్నాయి. కూతురు పరిస్థితి చూసి భయంతో వణికిపోతున్నారు తల్లిదండ్రులు. డాక్టర్లు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అంతుబట్టడం లేదు.

Telangana: ఎన్నడూ చూడని వింత.. పాప కంటి నుంచి ఉబికి వస్తున్న బియ్యం, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు
6 Year Old Girl

Updated on: May 20, 2023 | 1:18 PM

ఇప్పుడు మీరు చూడబోతున్నది. బహుశా గతంలో ఎన్నడూ చూడని ఓ విచిత్రం. నమ్మశక్యం కానీ వాస్తవ దృశ్యం. ఓ పాపకు అది భరించలేని కష్టం.. ఆమె కుటుంబానికి శాపం. అవును.. ఇది ఎలా సాధ్యం అనిపించే ఓ పాప విచిత్ర స్థితిని మీ ముందుకు తీసుకువచ్చాం.  పాప పేరు సౌజన్య. ఉంటోంది మహబూబాబాద్ జిల్లా కిష్ణాపురంలో. ఆరేళ్ల వయసున్న సౌజన్య కంటి నుంచి ఈ మధ్య తరచుగా ఇలాంటి వ్యర్థాలు వస్తున్నాయి. సాధారణంగా కళ్లలో నలక పడితేనే భరించలేం. అలాంటిది కంటి నుంచి నాన్‌స్టాప్‌గా ఇలా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, బియ్యపు గింజలు.. ఒక్కటేంటి, ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా రకరకాల ఐటమ్స్ వస్తున్నాయి. గత మూడు నెలలుగా ఇలా జరుగుతుంది.

అసలు ఇది ఎలా సాధ్యమో.. ఎందుకు వస్తున్నాయో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు ఆమె తల్లిదండ్రులు. ఇక ఆ పాప కంట్లో నుంచి ఆ వస్తువులు వస్తున్న ప్రతిసారి భరించలేని నొప్పితో అల్లాడుతోంది. సౌజన్య కంటి పరిస్థితిని చూసేందుకు విచిత్రంగా చూస్తున్నారు జనాలు. కూతురు బాధ, పరిస్థితిని చూసి అమ్మానాన్నలు తల్లడిల్లిపోతున్నారు.  ట్రీట్‌మెంట్‌ కోసం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి సౌజన్యను తరలించారు. మెడికల్ లిటరేచర్‌లో కానీ, సైన్స్‌లో కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయంపై క్లారిటీ లేదన్నారు డాక్టర్లు. పాపను అబ్జర్వేషన్‌లో నుంచి కొన్ని టెస్టులు చేస్తామని.. ఆ తర్వాత నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని డాక్టర్లు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..