Railway Coach Factory: ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేనట్టేనా.. బుల్లెట్ ట్రెయిన్ సంగతేంటి.. రైల్వే జీఎం ఏమంటున్నారంటే..

|

Oct 05, 2021 | 5:23 PM

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య రాష్ట్ర ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.

Railway Coach Factory: ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేనట్టేనా.. బుల్లెట్ ట్రెయిన్ సంగతేంటి.. రైల్వే జీఎం ఏమంటున్నారంటే..
Mps
Follow us on

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య రాష్ట్ర ప్రజలకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో రైల్వే ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు తమ నియోజవర్గాల్లోని సమస్యలన ప్రస్తావించారు. పెండింగ్ పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నాయి జీఎం అన్నారు. ఉందానగర్ నుంచి ఏయిర్‎పోర్ట్ వరకు త్వరలో ఎంఎంటీఎస్ రైలు రాబోతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై జీఎంఆర్ అధికారులతో రైల్వే అధికారుల చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమికంగా ప్రాజెక్టుపై చర్చించామని వెల్లడించారు.

ఇక బుల్లెట్ ట్రెయిన్ కూడా ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలకు లేనట్టేనని చెప్పారు. అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రైన్ సక్సెస్‎ను బట్టే మిగతా ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుపై స్టడీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, మహబూబ్‎నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరుకాగా… బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు.

Read Also.. Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మంత్రి కేటీఆర్ గూడ్ న్యూస్.. పూర్తి వివరాలు..