Love Affair: నమ్మించి గర్భవతిని చేశాడు.. ఆపై మకాం మార్చాడు.. మరి బాధిత యువతి ఏం చేసిందంటే..
Love Affair: పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసిన ప్రియుడు ఆ తర్వాత మొహం చాటేయడంతో ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది.
Love Affair: పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసిన ప్రియుడు ఆ తర్వాత మొహం చాటేయడంతో ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక తండాలో చోటుచేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలం పత్తిపాక తండాకు చెందిన యువతి, నెక్కొండ తండాకు చెందిన పురుషోత్తం కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆమెను తన వశం చేసుకున్నారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దాంతో తనను పెళ్లి చేసుకోవాలని పురుషోత్తంను యువతి నిలదీసింది. ముందు తప్పించుకోవాలని చూసినా.. ఆతర్వాత పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టడంతో పెళ్లికి అంగీకరించాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే కొద్దిరోజుల్లో పెళ్లి జరుగుతుందని అనుకుంటున్న సమయంలో పురుషోత్తం మరో ట్విస్ట్ ఇచ్చాడు. వరకట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటానని యువతికి పురుషోత్తం తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో తండా నుంచి పరారైన పురుషోత్తం.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
అంతేకాదు.. వేరే వ్యక్తుల చే ఫోన్ చేయిస్తూ అసభ్యకరంగా మాట్లాడిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను ప్రేమించాలంటూ అర్ధరాత్రి సమయాల్లో పురుషోత్తం స్నేహితుడు నగేష్ అనే వ్యక్తి చేత తరుచూ ఫోన్ కాల్స్ చేయిస్తున్నట్లుగా యువతి ఆరోపిస్తోంది. ఇదంతా తన క్యారెక్టర్‌పై మచ్చ వేసేందుకేనంటూ ఆరోపించింది. ఇక లాభం లేదనుకున్న యువతి.. పురుషోత్తం ఇంటి ముందు ధర్నాకు దిగింది. గత నాలుగు రోజులుగా నిద్రహారాలు మాని పత్తిపాక గ్రామంలో పురుషోత్తం ఇంటి ఎదుటే బాధితురాలు మౌనపోరాటం చేస్తోంది. మహిళా సంఘాలు, పోలీసులు తనకు అండగా నిలవాలని, తనను మోసం చేసిన పురుషోత్తంను పెళ్లికి ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని యువతి విజ్ఞప్తి చేస్తోంది.
Also read:
Encounter: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. కాల్చిపడేసిన పోలీసులు.. ఎక్కడ జరిగిందంటే..