Warangal: వరంగల్ లో హ్యాట్రిక్ పోస్టింగ్స్ IAS.. ఉద్యమాల జిల్లాలో ప్రత్యేక మార్క్.. 

| Edited By: Rajitha Chanti

Jun 16, 2024 | 8:00 PM

2023 మార్చి 13వ తేదిన వరంగల్ కలెక్టర్ గా నియమకమయ్యారు.. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ లో తన మార్కు నిరూపించుకున్న ప్రావీణ్య తాజాగా హనుమకొండ కలెక్టర్ గా నియామకమయ్యారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ లను బదిలీలు చేయగా వారిలో వరంగల్ కలెక్టర్ ప్రావిణ్యను హనుమకొండ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Warangal: వరంగల్ లో హ్యాట్రిక్ పోస్టింగ్స్ IAS.. ఉద్యమాల జిల్లాలో ప్రత్యేక మార్క్.. 
Pravinya Ias
Follow us on

వరంగల్ లో ఆ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక చరిత్ర నమోదు చేసుకుంది.. వరుసగా ఒకే నగరంలో మూడు పోస్టింగ్స్ సొంతం చేసుకొని ఆ జిల్లాలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.. తాజా బదిలీల్లో హనుమకొండ కలెక్టర్ గా నియామకమై ప్రశంసలు మూటకట్టుకుంటుంది. 2016 బ్యాచ్ కు చెందిన IAS అధికారిని పీ.ప్రావీణ్య… 2021 సెప్టెంబర్ 03వ తేదీన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.. 18 నెలల పాటు GWMC కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ప్రావీణ్య స్మార్ట్ సిటీ అభివృద్ధి లో తన మార్క్ నిరూపించారు. 2023 మార్చి 13వ తేదిన వరంగల్ కలెక్టర్ గా నియమకమయ్యారు.. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ లో తన మార్కు నిరూపించుకున్న ప్రావీణ్య తాజాగా హనుమకొండ కలెక్టర్ గా నియామకమయ్యారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ లను బదిలీలు చేయగా వారిలో వరంగల్ కలెక్టర్ ప్రావిణ్యను హనుమకొండ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్ లో వరుసగా మూడు పోస్టింగ్స్ నిర్వహించిన ఏకైక ఐఏఎస్ అధికారినిగా ప్రావీణ్య ప్రత్యేక రికార్డ్స్ సొంతం చేసుకుంది.. హ్యాట్రిక్ పోస్టింగ్స్ తో వరంగల్ లో సరికొత్త రికార్డ్ స్వంతం చేసుకున్న IAS అధికారిని ప్రావీణ్యకు పలువురు అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రావీణ్య.. గత ఏడాది వరంగల్ నగరం వరదల్లో చిక్కుకొని కకావికలం అవుతున్న సమయంలో ప్రభుత్వ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రాణనష్టం జరగకుండా నివారించ గలిగారు.. వరద ముప్పు నుండి వరంగల్లు ను ఘట్టెక్కించడంలో ఆమె చూపిన చొరవ పట్ల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధినిధులు కూడా అభినందించారు.. హ్యాట్రిక్ పోస్టింగ్స్ తన పనితీరుకు నిదర్శనమని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ప్రావిణ్యను ప్రశంశించారు..