Honor killing: వరంగల్‌ జిల్లాలో పరువు హత్య.. ప్రేమించినందుకు కన్న కూతురిని కడతేర్చిన తల్లి..

|

Dec 04, 2021 | 9:40 AM

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కర్కశంగా వ్యవహరించింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని గొంతు నులిమి దారుణంగా చంపేసింది.

Honor killing: వరంగల్‌ జిల్లాలో పరువు హత్య.. ప్రేమించినందుకు కన్న కూతురిని కడతేర్చిన తల్లి..
Follow us on

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కర్కశంగా వ్యవహరించింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని గొంతు నులిమి దారుణంగా చంపేసింది. ఆపై ఈ ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో నిజం నిగ్గుతేలింది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గత నెల 19వ తేదీన అంజలి అనే 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణంలో మృతురాలి తల్లి సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేలింది. కాగా వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహమైంది. అయితే పదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అంజలి(17).. అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్‌తో ప్రేమలో పడింది. పరాయి యువకుడితో ప్రేమలో ఉందన్న విషయం తల్లికి తెలియడంతో కూతురిని పలుమార్లు మందలించింది. అయినా అంజలిలో మార్పు రాలేదు. వారిద్దరు పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన సమ్మక్క తన తల్లి యాకమ్మతో కలిసి గత నెల 19న అర్ధరాత్రి అంజలి గాఢనిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు. కాగా పోలీసుల విచారణలో కులాంతర వివాహం చేసేందుకు ఇష్టం లేకనే అంజలిని హత్య చేశామని వారు ఒప్పుకున్నారు.

Also Read:

Telugu Akademi: తెలుగు అకాడమీలో అసలేం జరిగింది? పోలీసుల విచారణలో వెలులోకి వస్తున్న సంచలనాలు!

Crime News: భార్యతో సహా ఇద్దరు పిల్లలను హతమార్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్.. సూసైడ్ నోట్‌‌లో సంచలన విషయాలు!

Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో దారుణం.. కేవలం 20 నిమిషాల్లోనే విగత జీవులుగా తల్లీ, కూతురు.. ఏం జరిగిందంటే..!