Warangal: ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ రియల్ లైఫ్‌లోనూ చోటుచేసుకుంది. అందుకు వరంగల్ వేదికైంది. అక్కడి ఒ-సిటీ గ్రౌండ్‌లో హైడ్రామా నెలకుంది. రాత్రికి రాత్రే పోచమ్మతల్లి విగ్రహం వెలసింది. దీంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. పూజలు చేయడం ప్రారంభించారు. పెద్ద టెంట్ వేసి.. దూప, దీప నైవేథ్యాలు సమర్పించారు. ఏకంగా యాటపోతులే బలిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలు చెల్లించారు. భక్తులు తాకిడి అంతకంతకూ పెరిగిపోయింది. సీన్ చూస్తూ త్వరలోనే అక్కడ గుడి కట్టడం ఖాయం అనిపించింది. అంతలా భక్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఊహించని విధంగా తెల్లారేసరికి అమ్మావారి విగ్రహం మాయం కావడం సంచలనంగా మారింది. అయితే పోలీసులే విగ్రహాన్ని తొలగించారని భక్తులు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు కుట్ర పన్నారని.. వారికి పోలీసులు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అసలు విగ్రహం అక్కడకు ఎలా వచ్చింది.. ఎలా మాయం అయింది అన్నది తేలాల్సి ఉంది. ఓవరాల్ సీన్‌ని గమనిస్తే మాత్రం వెనుక ఏదో గూడుపుఠాణి ఉందని మాత్రం అర్థమవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ కోసం క్లిక్ చేయండి..