Warangal sports: ఓరుగల్లులో క్రీడా సౌరభం.. లాంగ్‌ జంప్‌.. పరుగుపందెంలో జోష్‌ చూపిన మహిళా స్ప్రింటర్లు

|

Sep 15, 2021 | 9:21 PM

క్రీడా సౌరభం గుబాళించింది. ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. హనుమకొండలో ఘనంగా ప్రారంభమయ్యాయి 60వ నేషనల్‌

Warangal sports: ఓరుగల్లులో క్రీడా సౌరభం..  లాంగ్‌ జంప్‌.. పరుగుపందెంలో జోష్‌ చూపిన మహిళా స్ప్రింటర్లు
Warangal Sports
Follow us on

Warangal sports Championships: క్రీడా సౌరభం గుబాళించింది. ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. హనుమకొండలో ఘనంగా ప్రారంభమయ్యాయి 60వ నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు. దీంతో ఓరుగల్లు అంతటా క్రీడా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది వరంగ‌ల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేష‌న్. హ‌నుమ‌కొండ బ‌స్‌స్టేష‌న్ స‌మీపంలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 19 వ‌ర‌కూ జ‌రుగనుంది ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్.

ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆల్ ఇండియా పోలీస్‌, రైల్వేస్‌, ఎల్ఐసీ వంటి యూనిట్లతో పాటు 21 రాష్ట్రాల నుంచి 519 మంది అధ్లెట్లు వచ్చారు. స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ సర్వీసెస్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఈ మెగా ఈవెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. షాట్‌పుట్ పోటీల్లో ఉత్సహంగా పాల్గొన్నారు క్రీడాకారులు. లాంగ్‌ జంప్‌ పోటీల్లో యువతను ఆకట్టుకున్నాయి. అటు పరుగుపందెంలో జోష్‌ చూపారు మహిళా స్ప్రింటర్లు.

ఈ పోటీలకు వరంగల్‌ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు నగర వాసులు. ఓరుగల్లు వైభవాన్ని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు నేతలు, ఆఫీసర్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడ‌ల‌కు ప్రాధాన్యత ఇస్తూ.. జేఎన్ఎస్‌లో సింథ‌టిక్ ట్రాక్ నిర్మాణానికి స‌హ‌క‌రించార‌ని చెప్పారు దాస్యం వినయ్‌భాస్కర్‌. భ‌విష్యత్‌లో ఇలాంటి మ‌రెన్నో జాతీయ స్ధాయి క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తామ‌ని వెల్లడించారు ప్రభుత్వ చీఫ్‌విప్‌. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అథ్లెట్లు. తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్‌ చెబుతున్నారు క్రీడాకారులు.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.. కేంద్ర మంత్రులకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం..