Warangal: ఉల్లాసంగా, ఉత్సాహంగా.. వరంగల్‌లో బీచ్ బాల్‌కు ఫుల్ క్రేజ్.. సముద్రం లేకపోయినా ఇలా..

|

Apr 11, 2021 | 12:55 PM

వరంగల్‌లో బీచ్ బాల్ ఫుల్ క్రేజీగా మారింది. మగవారే కాదు మహిళలు కూడా బీచ్ బాల్‌తో తెగఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వరంగల్‌లో సముద్రం లేదన్న...

Warangal: ఉల్లాసంగా, ఉత్సాహంగా.. వరంగల్‌లో బీచ్ బాల్‌కు ఫుల్ క్రేజ్.. సముద్రం లేకపోయినా ఇలా..
Warangal Beach Ball
Follow us on

వరంగల్‌లో బీచ్ బాల్ ఫుల్ క్రేజీగా మారింది. మగవారే కాదు మహిళలు కూడా బీచ్ బాల్‌తో తెగఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వరంగల్‌లో సముద్రం లేదన్న వెలితి కనిపించకుండా పోయింది. స్థానికులు భద్రకాళి సరస్సు తీరాన వాలీ బాల్‌ కోర్టులు ఏర్పాటు చేసుకొని ఆడ, మగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతున్నారు.

వరంగల్‌లో బీచ్‌బాల్‌కి క్రేజ్ పెరగడంతో .. నగరానికి చెందిన కొంతమంది యువకులు వరంగల్- హన్మకొండ జంట నగరాల మధ్య భద్రకాళి ట్యాంక్‌బండ్‌ పక్కనే బీచ్ బాల్ జోన్ ఏర్పాటు చేశారు. ఓవైపు సుందర దృశ్యాలతో రూపుదిద్దుకున్న భద్రకాళి ట్యాంక్‌ బండ్‌ దగ్గరే ఈ బాల్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో పురుషులే కాదు మహిళలు సైతం ఇక్కడకు వచ్చి ఆడుతూ సందడి చేస్తున్నారు. మహిళలు ఈ రెడీమెడ్‌ బీచ్‌లో చాలా ఉత్సాహంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అలసట తెలియకుండా ఆడే ఇలాంటి క్రీడలు ఒంటికి మంచి వ్యాయమంలా ఉపయోగపడతాయంటున్నారు.

కామన్‌గా సినిమాలు-టీవీ షోలో బీచ్‌బాల్‌ చూసి చాలా మంది అలా ఎంజాయ్‌ చేయాలని ముచ్చట పడుతుంటారు. ప్రస్తుతం వరంగల్‌లోని హంటర్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ బీచ్‌బాల్‌తో తమ కోరిక తీరిందని వరంగల్‌వాసులు మురిసిపోతున్నారు. మహిళలైతే మగవారితో పోటీపడి మరీ తమ ఫిట్‌నెస్‌ పెంచుకునేపనిలో పడ్డారు.

Also Read:  భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే… ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?