Warangal: వరంగల్‌ ఆర్టీసీ సిటీ బస్టాండ్‌ అర్థరాత్రి డిటోనేటర్లతో నేల మట్టం.. ఎందుకో తెలుసా..?

| Edited By: Balaraju Goud

May 22, 2024 | 7:24 AM

బాంబులతో బస్టాండ్ కూల్చివేశారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో పాత భవనం తొలగింపు పనులు చకచకా జరుగుతున్నాయి. కొత్త బస్టాండ్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్ స్టేషన్‌ను అర్ధరాత్రి తర్వాత జనసంచారం లేని సమయంలో జిలెటిన్ స్టిక్స్ వాడి భవనాలను కూల్చి వేశారు.

Warangal: వరంగల్‌ ఆర్టీసీ సిటీ బస్టాండ్‌ అర్థరాత్రి డిటోనేటర్లతో నేల మట్టం.. ఎందుకో తెలుసా..?
Warangal Rtc Bus Stand
Follow us on

బాంబులతో బస్టాండ్ కూల్చివేశారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో పాత భవనం తొలగింపు పనులు చకచకా జరుగుతున్నాయి. కొత్త బస్టాండ్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్ స్టేషన్‌ను అర్ధరాత్రి తర్వాత జనసంచారం లేని సమయంలో జిలెటిన్ స్టిక్స్ వాడి భవనాలను కూల్చి వేశారు. ఆదే ప్రాంతంలో రూ.70కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల మోడల్ బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు.

వరంగల్‌లోని ఆర్టీసీ సిటీ బస్టాండ్‌ను అర్థరాత్రి డిటోనేటర్లతో నేల మట్టం చేశారు. జన సంచారం లేని సమయంలో బాంబులతో ఒక్క పెట్టున కూల్చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.70కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి.

బహుళ అంతస్తులలో మోడల్ బస్‌ స్టేషన్ నిర్మించనున్నారు.. అయితే దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన పాత బస్టాండ్ పటిష్టంగా ఉంది. తొలగింపు అసాధ్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో సిటీ బస్ స్టేషన్ ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జనసంచారం లేని సమయంలో జిలెటిన్ స్టిక్స్ తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్‌క్యూవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు సిబ్బంది తెలిపింది.

ఆర్టీసీ బస్టాండ్ నేల మట్టం.. వీడియో ఇదిగో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…