Watch Video: అక్కడ డీజే సౌండ్స్‎ బంద్.. పోలీసుల కీలక ప్రకటన..

వరంగల్ మహా నగరంలో డీ జే సౌండ్స్‎పై పోలీసులు ఆంక్షలు విధించారు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. డి.జె సౌండ్స్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డి.జెలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. రాత్రి సమయాల్లో పెళ్ళి ఊరేగింపులు, ఇతర శుభకార్యాల వేళ డీజేలు ఏర్పాటు చేయడం నిషేధం అన్నారు.

Watch Video: అక్కడ డీజే సౌండ్స్‎ బంద్.. పోలీసుల కీలక ప్రకటన..
Dj Sounds

Edited By:

Updated on: Apr 08, 2024 | 11:13 AM

వరంగల్ మహా నగరంలో డీ జే సౌండ్స్‎పై పోలీసులు ఆంక్షలు విధించారు. గీత దాటితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. డి.జె సౌండ్స్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డి.జెలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. రాత్రి సమయాల్లో పెళ్ళి ఊరేగింపులు, ఇతర శుభకార్యాల వేళ డీజేలు ఏర్పాటు చేయడం ద్వారా శబ్ద కాలుష్యం ఏర్పడడంతో పాటు, అనేక గొడవలకు కారణంగా మారుతున్నాయి. చాలామందికి నిద్ర లేకుండా పోతుంది. ఈ నేపధ్యంలో వరంగల్ ట్రై సిటీ‎స్‎లో డి.జె లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, డి.జెలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

పెళ్ళి ఊరేగింపు వేల డిజెలు వినియోగిస్తుండటంతో వీటి ద్వారా అధిక శబ్దాలు వస్తుండడంతో హృద్రోగులు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడంతో పాటు విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరీక్షల వేళ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తుండటంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచనల మేరకు డిజేల వినియోగంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇకపై నగరంలో డి.జె లు ఏర్పాటుకు అనుమతి లేదని ఎవరైనా డి.జెలు ఏర్పాటుచేస్తే డి.జె వాహనం సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాహ ఊరేగింపులు రాత్రి 10.30 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని.. ఎవరైనా పోలీసుల ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us