వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి నాయక్‌ది ఆత్మహత్యే అని.. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం మాత్రం సైఫ్ అని స్పష్టం చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో వచ్చిందని..ఈ రిపోర్ట్‌లో అదే తేలిందన్నారు. విషం కారణంగానే ప్రీతి మరణించినట్టు రిపోర్ట్ వచ్చిందన్నారు. ప్రీతి శరీరంలో పాయిజన్ ఆనవాళ్లు దొరికాయన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు స్పాట్‌లో ఇంజక్షన్ దొరికిందన్నారు. కానీ నీడిల్ మిస్సైందన్నారు సీపీ రంగనాథ్.
త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. సైఫ్‌పై 306 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసు 99శాతం క్లియర్ అని వరంగల్ సీపీ రంగనాథ్ తేల్చి చెప్పారు. కొద్ది నెలల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెను నెలల పాటు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే, మెడికో ప్రీతిది ఆత్మహత్యా కాదని.. హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం