Warangal: కాకతీయ మెడికల్‌ కాలేజీలో కరోనా కల్లోలం.. 17 మంది మెడికోలకు పాజిటివ్‌..

|

Jan 08, 2022 | 8:33 PM

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఏకంగా 17 మంది మెడికోలు కరోనా బారిన పడ్డారు..దీంతో మిగిలిన మెడికోలు..

Warangal: కాకతీయ మెడికల్‌ కాలేజీలో కరోనా కల్లోలం.. 17 మంది మెడికోలకు పాజిటివ్‌..
Kakatiya Medicos
Follow us on

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఏకంగా 17 మంది మెడికోలు కరోనా బారిన పడ్డారు..దీంతో మిగిలిన మెడికోలు – అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.. ఎంజీఎంలో వైద్యసేవలు అందిస్తున్న క్రమంలోనే వారంతా కోవిడ్ బారిన పడ్డారని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్స్ ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజుల నుండి వరంగల్ కో కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది.. ఎంజీఎంలోని కోవిడ్ వార్డుకు కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. కరోనా బాధితులకు మెడికల్ స్టూడెంట్స్ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను అందిస్తూ.. మెడికోలు కూడా కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన మెడికోలు కోవిడ్ బారిన పడ్డారు.. స్వల్ప లక్షణాలున్న mbbs విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.. వీరిలో 17 మందికి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది.. ఈ నేపథ్యంలో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 17మంది కోవిడ్ బారిన పడడంతో తోటి మెడికలో, పీజీ డాక్టర్లు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.. ఎంజీఎంలో రెగ్యులర్ గా వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే కోవిడ్ బారిన పడ్డారని ఆందోళన చెందుతున్నారు.

Reporter: G.Peddeesh Tv9 telugu

Also Read:

తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా పెరుగుతోన్న కేసులు.. 24 గంటల్లో ఏకంగా..

మల్లన్న భక్తులకు అలెర్ట్.. చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచన..