Viral Video: బౌరంపేటలో అధ్వానంగా మారిన రోడ్లు.. వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు

తెలంగాణలోని కుత్బుల్లాపూర్‌లోని బౌరంపేట వాసులు అధ్వాన్నమైన రహదారి, భారీ గుంతలతో విసిగిపోయి తమ అసంతృప్తిని భిన్నమైన వెళ్లగక్కారు. ఇదే విషయమై నిరసన వ్యక్తం చేశారు. నీరు నిలిచిన రోడ్డు గుంతల వద్దకు ప్రజలు వచ్చి వరి నాట్లు వేశారు. మునిసిపల్ కమిషనర్లు, స్థానిక అధికారుల పనితీరుని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి తమ సమస్య  పదిమందిని ఆకర్షించేలా చేయడానికి ప్రజలు భిన్నమైన పద్దతిని ఎంచుకున్నారు.

Viral Video: బౌరంపేటలో అధ్వానంగా మారిన రోడ్లు.. వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు
Viral Video

Updated on: Jul 22, 2024 | 8:56 PM

చిన్న పాటి వర్షాలకే నగరంలోని రోడ్ల మీద ప్రయాణం చాలా కష్టం.. అలాంటిది రోజుల తరబడి వర్షాలు కురిస్తే అప్పుడు రహదారుల పరిస్తితి నదులను తలపిస్తూ ఉంటాయి. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణించడం ఓ సాహస యాత్రే అని చెప్పవచ్చు. రోడ్లమీద గుంటలతో విసిగిన ప్రజలు తమ అసంతృప్తిని బిన్న మార్గాల్లో తెలుపుతున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోడ్లు తెలంగాణాలోని హైదరబాద్ నగర పరిధిలోకి వస్తాయి. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలోని కుత్బుల్లాపూర్‌లోని బౌరంపేట వాసులు అధ్వాన్నమైన రహదారి, భారీ గుంతలతో విసిగిపోయి తమ అసంతృప్తిని భిన్నమైన వెళ్లగక్కారు. ఇదే విషయమై నిరసన వ్యక్తం చేశారు. నీరు నిలిచిన రోడ్డు గుంతల వద్దకు ప్రజలు వచ్చి వరి నాట్లు వేశారు. మునిసిపల్ కమిషనర్లు, స్థానిక అధికారుల పనితీరుని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి తమ సమస్య  పదిమందిని ఆకర్షించేలా చేయడానికి ప్రజలు భిన్నమైన పద్దతిని ఎంచుకున్నారు. వరి నాట్లు గుంతలలో వేశారు. నీటమునిగిన రోడ్లు, శిథిలావస్థకు చేరడంతో రోజువారీ ప్రయాణం కష్టతరంగా మారింది. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు.

ఇవి కూడా చదవండి

గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న మహిళలు

నిరసనకు సంబంధించిన వీడియోను కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గుంత దగ్గర నిలబడి వరి మొక్కలు ఒక్కొక్కరుగా నాటుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు పలువురు నెటిజన్లు తమ వీదిలోని రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని తెలుపుతూ కొతమంది కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..