Telangana: సైబర్ నేరాల బారిన పడితే ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఖాతాలోకి డబ్బు..

| Edited By: Srikar T

Jul 03, 2024 | 1:47 PM

తెలంగాణలో పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాలు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాయి. తెలంగాణలోనే కాదు యావత్తు ప్రపంచం రెండు నేరాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఒకటి డ్రగ్స్ మరొకటి సైబర్ క్రైమ్. ఈ రెండు నేరాలపై తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు ఇప్పటికే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన వసతులు అన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చింది. ఇక తాజాగా ఈ రెండు విభాగాలకు సంబంధించి దాదాపు 100కు పైగా వాహనాలను పోలీసులకు ప్రభుత్వం కేటాయించింది.

Telangana: సైబర్ నేరాల బారిన పడితే ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఖాతాలోకి డబ్బు..
Cyber Crime
Follow us on

తెలంగాణలో పోలీసు వ్యవస్థలోని అన్ని విభాగాలు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాయి. తెలంగాణలోనే కాదు యావత్తు ప్రపంచం రెండు నేరాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఒకటి డ్రగ్స్ మరొకటి సైబర్ క్రైమ్. ఈ రెండు నేరాలపై తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు ఇప్పటికే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన వసతులు అన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చింది. ఇక తాజాగా ఈ రెండు విభాగాలకు సంబంధించి దాదాపు 100కు పైగా వాహనాలను పోలీసులకు ప్రభుత్వం కేటాయించింది.

ముఖ్యంగా సైబర్ క్రైమ్‎ను ఎదుర్కోవటంలో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సైబర్ క్రైమ్‎కు పాల్పడుతున్న నేరస్తులు మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటుండడంతో వారిని అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావటం పోలీసులకు కత్తి మీద సాముల మారిపోయింది. అటు పోలీసులకు వచ్చే అలయన్స్‎లోనే వీటికోసం కేటాయించాల్సి వస్తుంది. దీంతో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 2,52,000 మంది బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. వీరు పోగొట్టుకున్న డబ్బు అక్షరాల 262 కోట్లుగా వెల్లడించారు అధికారులు. వీటిలో పోలీసులు రికవరీ చేయగలిగింది రూ.31 కోట్ల రూపాయలు. ఇక సైబర్ నేరగాళ్లు వాడిన దాదాపు 1.57 లక్షల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

సైబర్ నేరాల నియంత్రణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తుంది. సైబర్ నేరగాలను పట్టుకునేందుకు ఎంత దూరమైనా సరే వెళ్లేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిద్దమయింది. నేరగాళ్ల భారిన పడకుండా ఉండేలా బాధితులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. తెలిసో తెలియకో సైబర్ నేరస్తుల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే మరో ఆలోచన లేకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‎కు ఫోన్ చేసి వివరాలు చెప్పాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న గంటల వ్యవధిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..