Ayodhya Ram Temple : ఇవాళ్టి నుంచి తెలంగాణలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ

|

Jan 20, 2021 | 6:33 AM

అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నది. 20 రోజులపాటు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి...

Ayodhya Ram Temple : ఇవాళ్టి నుంచి తెలంగాణలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ
Follow us on

Fundraising for Ayodhya Ram temple : అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ కార్యక్రమం తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నది. 20 రోజులపాటు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. 20 రోజులపాటు శ్రేణులన్నీతమ కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి నిధి సేకరణలోనే పాల్గొననున్నాయి. బుధవారం నుంచి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ అనే  కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలోని 9000 గ్రామాల్లో ప్రతి ఇంటిని శ్రీరామ మందిర నిర్మాణంలో భాగం చేస్తామని సంఘ పరివార క్షేత్రాలు పేర్కొన్నాయి. 3 కోట్లకు పైగా హిందువులను ప్రత్యక్షంగా కలువనున్నారు. అయోధ్య శ్రీ రామ మందిరం జాతి స్వాభిమాన మందిరం అని అన్నారు. 492 సంవత్సరాల నిరీక్షణ, 76 ప్రత్యక్ష పోరాటాలు, 4.5 లక్షల మంది రామ భక్తుల బలిదానాలు, 135 సంవత్సరాల న్యాయపోరాటం అనంతరం నేడు మందిర నిర్మాణ కల సాకారమవుతుందని అన్నారు. మందిర నిర్మాణంలో పాల్గొనే అదృష్టం ఈ తరానికి కలిగిన అదృష్టం అని సంఘ పరివార క్షేత్రాలు తెలియజేశాయి.

ఇవి కూడా చదవండి :

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ గంట పాటు భేటీ.. పెండింగ్‌ నిధులతోపాటు ఈ 13 అంశాలే కీలకం

Key Meeting on Polavaram : ఇవాళ ఢిల్లీలో పోలవరంపై కీలక భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌పై చర్చ