Nizamabad Fire Accident: నిజమాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీలో మంటలు.. ఒకరు సజీవదహనం..

Nizamabad Fire Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి సజీవదహనమైన సంఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Nizamabad Fire Accident: నిజమాబాద్‌లో ఘోర ప్రమాదం.. లారీలో మంటలు.. ఒకరు సజీవదహనం..
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2021 | 7:40 AM

Nizamabad Fire Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి సజీవదహనమైన సంఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ రోడ్డులో రహదారి పక్కన నిలిపి ఉన్న లారీకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. అయితే లారీకి ఎలా మంటలు అంటుకున్నాయనేది తెలియరాలేదు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే లారీలో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Ayodhya Ram Temple : ఇవాళ్టి నుంచి తెలంగాణలో అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ