Indian Citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం మరోసారి కోర్టుకు తెలిపింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబందం లేదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు వాదించారు. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ భారత దేశంలోని ఉన్నాడని కోర్టుకు వివచింరారు. అంతేకాదు.. చెన్నమనేని రమేష్ రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు చెన్నమనేని రమేష్‌ను కావాలనుకుంటున్నారి ఏడీజీ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ వలన శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందంటే అది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామనాని కోర్టుకు ఏడీజీ తెలిపారు. అయితే, ఈ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also read: