Summer Effect: ఎండ వేడిమికి భగ్గుమంటున్న వాహనాలు, ఆగివున్న కారు, బైకు దగ్ధం..ఒకేరోజు రెండు ఘటనలు..

|

May 12, 2022 | 8:50 PM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడిమి, ఉష్ణగాలుల కారణంగా జన జీవనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలకు పలుచోట్ల అగ్గిరాజుకుంటోంది.

Summer Effect: ఎండ వేడిమికి భగ్గుమంటున్న వాహనాలు, ఆగివున్న కారు, బైకు దగ్ధం..ఒకేరోజు రెండు ఘటనలు..
Summer Effect
Follow us on

ఓ వైపు తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడిమి, ఉష్ణగాలుల కారణంగా జన జీవనం అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలకు పలుచోట్ల అగ్గిరాజుకుంటోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒకేరోజు రెండు వాహనాలు ఉన్నట్టుండి భగ్గుమన్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నిలిపిఉంచిన ఓ కారు, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని వటపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్క్‌ చేసి ఉంచిన బైక్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పే ప్రయత్నం చేశారు. మంటల ధాటికి బైక్‌ పూర్తిగా తగలబడిపోయింది. కాలిపోయిన బండి పెద్ద శంకరంపేట మండలం బూజురం పల్లికి చెందిన రాములుది గుర్తించారు. వటపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ భూమి రిజిస్ట్రేషన్‌ పనిమీద రాములు ఇక్కడ వచ్చి.. కార్యాలయం బయటే బైక్‌ను పార్క్‌ చేసి ఉంచాడు. ఈ క్రమంలోనే ఎండవేడికి బైక్‌లో మంటలు వ్యాపించినట్టుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు, మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట సమీపంలో ఎండవేడిమి కారణంగా మరో కారు తగలబడిపోయింది. ఆగివున్న కారులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అధిక ఉష్ణోగ్రతలు, ఎండవేడికి కారులో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా ఫైర్‌ సిబ్బంది వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఎండ వేడిమి, ఉష్ణగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నట్టుగా వివరించారు. వాహనదారులు, వాహన చోదకులు తమ వాహనాలను ఎండలో పార్కింగ్ చేయకుండా, నీడలో, చెట్ల కింద, పార్క్‌ చేయాలని సూచించారు. తీవ్రమైన ఎండ, మండుతున్న ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వాహనాలు మోటార్ సైకిల్ లు, కార్లు, లారీల్లో అగ్ని ప్రమాదలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఉదయం, సాయంత్రం వేళలో వాహనాలలో ప్రయాణించాలని మధ్యాహ్నం వేళలో ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Dalit Bandhu: దళితబంధు నిధులు ప్రైవేట్ ఉద్యోగుల ఖాతాల్లోకి..! రూ.10లక్షల చొప్పున రూ.15కోట్లు ట్రాన్స్‌ ఫర్‌

Meal scheme: ఆస్పత్రుల్లోని అటెండర్లకు కడుపు నిండా భోజనం..రూ.5లకే ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

Chennai Airport: అచ్చం సూర్య సినిమా సీన్‌ రిపీట్‌ చేశారు..కానీ, కథ అడ్డం తిరిగి అలా బుక్కయ్యారు..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట థియేటర్‌లో ప్రేక్షకుల ఆందోళన.. టికెట్‌ డబ్బులు వాపస్‌ చేసిన యాజమాన్యం

Adilabad: స్కూల్ టీచర్ల గబ్బుదందా..సంఘ భవనమే అడ్డాగా గురువుల అకృత్యాలు..