ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి www. Health telangana.gov.inలో వ్యాక్సిన్ కోసం స్లాట్స్ బుకింగ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అలాగే విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జూన్ 5 నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2384 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,83,228కి చేరింది. మరో 17 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 3313కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,379 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. అటు నిన్న 2,242 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,46,536కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 307, నల్గొండ 170, రంగారెడ్డి 135, మేడ్చల్ మల్కాజ్ గిరి 116, కరీంనగర్ 103, ఖమ్మం 167, కొత్తగూడెం జిల్లాల్లో 113 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.