తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ప్రచారం.. బండి సంజయ్ ఫస్ట్ రియాక్షన్..!

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కమ్యునిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ ఫైర్ అయ్యారు.

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ప్రచారం.. బండి సంజయ్ ఫస్ట్ రియాక్షన్..!
Bandi Sanjay

Updated on: Aug 15, 2025 | 7:22 PM

తెలంగాణలో మర్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారం.. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. మీరు మర్యాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… తాము హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తామన్నారు. ఈ ఉద్యమం కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ ఫైర్ అయ్యారు. మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉంటున్నారనే కారణంతో.. ఒక పద్దతి ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో మార్వాడీలు ఉన్నారు, అక్కడ గో బ్యాక్ అంటున్నారా? అంటూ నిలదీశారు. మార్వాడీల కారణంగా తెలంగాణ జీడీపీ పెరుగుతోందన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం కావాలని వారు కోవడం లేదని.. కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాలను తెలంగాణ ప్రజలు స్వాగతించబోరని అన్నారు.

పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు? అని ప్రశ్నించారు. రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తామన్నారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా? అన్నారు. ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా? కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అని ప్రశ్నించరు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.

వీడియో చూడండి..