Telangana BJP core committee meeting: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతోపాటు పలు కీలక అంశాలపై మాట్లాడారు. అనంతరం అమిత్ షా.. తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ సమావేశంలో.. అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయడంతోపాటు పలు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి, మునుగోడు ఉపఎన్నికపై చర్చించి.. పలు సూచనలు చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉండొచ్చంటూ అమిత్‌షా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎప్పుడైనా ఒక్కటవుతాయనే విషయాన్ని ప్రజలకు మరింత క్లియర్‌గా అర్థం కావలని.. దీనిపై కార్యచర్యణ రూపొందించి తెలియజెప్పాలంటూ సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్ అయిందన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని.. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని రాష్ట్ర నేతలకు సూచించారు.
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీసిన షా.. గతంలో ఇచ్చిన కార్యక్రమాల ఫీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ గెలవని 19 ఎంపీ స్థానాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. పార్టీలో ఐక్యత అవసరమని.. బుత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..