ఇసుక రవాణా చేస్తుండగా ఊహించని ప్రమాదం.. ఒక్కసారిగా ఉప్పొంగిన వాగు.. ఆ తర్వాత..!

మానేరువాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్లతో సహా వరదల్లో చిక్కుకుని ఆహాకారాలు చేశారు.. వాగులో చిక్కుకున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.. కానీ ఎనిమిది ట్రాక్టర్లు వరదల్లో మునిగి పోయాయి..

ఇసుక రవాణా చేస్తుండగా ఊహించని ప్రమాదం.. ఒక్కసారిగా ఉప్పొంగిన వాగు.. ఆ తర్వాత..!
Unforeseeable Danger For Tractors

Edited By: Balaraju Goud

Updated on: Sep 12, 2025 | 3:00 PM

మానేరువాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్లతో సహా వరదల్లో చిక్కుకుని ఆహాకారాలు చేశారు.. వాగులో చిక్కుకున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.. కానీ ఎనిమిది ట్రాక్టర్లు వరదల్లో మునిగి పోయాయి..

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు వరదల్లో చిక్కుకున్నాయి. ఇసుక రవాణా చేస్తున్నవారు తృటిలో తప్పించుకుని పోలీసులు, స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో జరిగింది. గర్మిళపల్లి-ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగు నుండి ఇసుక రవాణా కోసం శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం ఇందిరమ్మ 11 ట్రాక్టర్లు వెళ్ళాయి. ఇసుక తోడుతున్న క్రమంలో అకస్మాత్తుగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో మానేరు వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. వాగు మధ్యలో ఇసుక నింపుకుంటున్న ట్రాక్టర్లు ఎటూ వెళ్లలేని స్థితిలో నిలిచిపోయాయి. అయితే ఇసుక నింపుకున్న 5 ట్రాక్టర్లు వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో 5 ట్రాక్టర్లు వాగు మధ్యలో చిక్కుకుని ఎటు వెళ్లలేని స్థితిలో మునిగి పోయాయి. ట్రాలీలు బోల్తా పడటంతో డ్రైవర్లు ట్రాక్టర్ పైకి ఎక్కి ఆహాకారాలు చేశారు. స్థానికులు, పోలీసుల అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. తాళ్ల సహాయంతో డ్రైవర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ట్రాక్టర్లను బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..