రూ.200అప్పు.. అవమానం భరించలేక యువకుడి బలవన్మరణం

తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంటికి తిరిగివచ్చిన మధు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనులు ముగించుకొని ఇంటికి రాగా మధు విగతజీవిగా పడి ఉన్నాడు. కొడుకును అలా చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....

రూ.200అప్పు.. అవమానం భరించలేక యువకుడి బలవన్మరణం
Young Man Commits Suicide

Updated on: Mar 02, 2025 | 10:14 AM

కోడి పందేల వద్ద రూ.200 అప్పు ఇవ్వనందుకు బెల్టుతో దాడి చేశాడు….అవమాన భారంతో యువకుడు జోగురు మధు(20) పురుగు మందు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చెన్నూరు మండలం కొమ్మెర గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….మధు కొంతకాలంగా జూదం కోడి పందేల ఆటలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత మదు పొన్నారం గ్రామంలో కోడిపందేలు ఆడేందుకు వెళ్లాడు. నాగాపూర్ కు చెందిన గోపి అనే వ్యక్తి రూ.200 అప్పు ఇవ్వాలని మధును కోరగా అందుకు నిరాకరించాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో అందరిముందు మధును బెల్టుతో కొట్టాడు.

తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంటికి తిరిగివచ్చిన మధు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనులు ముగించుకొని ఇంటికి రాగా మధు విగతజీవిగా పడి ఉన్నాడు. కొడుకును అలా చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..