Crop Loss: రైతు పుట్టి ముంచిన అకాల వర్షాలు.. పంటలన్నీ వర్షార్పణం.. బోరున విలపిస్తున్న కర్షకులు..

|

Apr 26, 2023 | 9:14 AM

రెక్కల కష్టమిలా వర్షార్పణం అయింది. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయ్. అప్పటిదాక పంటను చూసుకొని ముసిరిపోయిన రైతును.. ఉప్పెనగా విరుచుకుపడ్డ వడగాళ్ల వాన కోలుకోకుండా చేసింది. కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా నిలిచిపోయాడు. నోటికాడికి వచ్చిన పంట... చేతికి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

Crop Loss: రైతు పుట్టి ముంచిన అకాల వర్షాలు.. పంటలన్నీ వర్షార్పణం.. బోరున విలపిస్తున్న కర్షకులు..
Crop Loss
Follow us on

రెక్కల కష్టమిలా వర్షార్పణం అయింది. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయ్. అప్పటిదాక పంటను చూసుకొని ముసిరిపోయిన రైతును.. ఉప్పెనగా విరుచుకుపడ్డ వడగాళ్ల వాన కోలుకోకుండా చేసింది. కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడిగా నిలిచిపోయాడు. నోటికాడికి వచ్చిన పంట.. చేతికి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

కోలుకోలేని దెబ్బతీసిన అకాల వర్షాలు..

అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిలువునా ముంచేశాయి. ఆరుగాలం శ్రమించి… పండించిన పంటను అమ్ముకుందామనే ఆశతో ఎదురు చూసిన అన్నదాతను వడగళ్లు, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వర్షాలు చేతికందాల్సిన పంటను నేలపాలు చేశాయి. ఎన్నో కష్ట నష్టాలకు ఎదురొడ్డి పండించిన పంటను అకాల వర్షం తుడిచిపెట్టుకు పోతుంటే చేష్టలుడిగి చూస్తుండిపోయాడు అన్నదాత.

దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మామిడి పంటలు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చింది. మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వరి, మామిడి పంటలకు తవ్ర నష్టం కల్గింది. గాలి దుమారానికి మామిడి పంట నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి బస్తాలు తడవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రామాయంపేట శివారులో గాలివానకు చెట్టు విరిగి బైక్‌పై వెళ్తున్న వారిపై పడింది. దీంతో బైక్‌పై వెళ్తున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో భారీ పంట నష్టం వాటిల్లింది. చేగుంట మండలం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకా వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. పలుచోట్ల మొక్కజొన్న, వరి పంటు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర… రోడ్డుపై ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామానికి చెందిన పాతకుంట మొహన్… పిడుగుపాటుతో మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న క్రాస్ రోడ్డు వద్ద రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలల ధాటికి ఖాళీ ఆటో కొట్టుకుపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..