Ugadi Fest: స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో సంబరంగా ఉగాది వేడుకలు.. మాజీ ఉపరాష్ట్రపతి, గవర్నర్ హాజరు
హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాలతో నివాళులర్పించారు.
హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాలతో నివాళులర్పించారు. ఆపై దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ భవన్, అటల్ జీ నైపుణ్య శిక్షణ కేంద్రాలతోపాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమాలను పరిశీలించారు.
తెలుగు ప్రజలందరికీ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మీ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పులను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే, కొత్తపయనం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుందన్న వెంకయ్య. ప్రతి ప్రయత్నానికి ఉగాది లాంటి ఓ రోజును ప్రారంభంగా తీసుకోవాలన్నారు. భారత్ అభివృద్ది దిశగా ముందుకు సాగే క్రమంలో ఉగాదిని ఆహ్వానించాలి, ఆస్వాదించాలని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయం చాలా గొప్పవని, మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు వెంకయ్య నాయుడు.
స్వర్ణభారతి ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుంది. ఐక్యంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని గవర్నర్ రాధాకృష్ణన్ అకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…