AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలోకి..

బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో తెలుగు బిడ్డ పోటీ చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ పక్రటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీకమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలోకి..
Uday British Parliament Elections
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 16, 2024 | 11:41 AM

Share

బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో తెలుగు బిడ్డ పోటీ చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ పక్రటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీకమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‎లోనూ ఎన్నికల హడావిడి మొదలయింది. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యా ప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికిచెందిన నాగరాజు హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు.. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు.

బ్రిటన్‎లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‎లో అడ్మినిస్ట్రేటివ్‎ సైన్స్‎లో పీజీ చేశారు. ప్రస్తుత సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‎ని నెలకొల్పా రు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేతస్ర్థాయి సమస్యలపైన ఉదయ్‎కు మంచి పట్టు ఉంది. స్కూ ల్ గవర్నర్‎గా, వాలంటీర్‎గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థల పక్రారం ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పనుంది. ప్రఖ్యాత తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్, రాష్ట్రమేయర్ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీనితో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు